Hyderabad: రామంతపూర్‌లో భారీ పేలుడు | Massive Explosion At Scrap Shop In Ramanthapur Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: రామంతపూర్‌లో భారీ పేలుడు

Oct 25 2026 1:56 PM | Updated on Oct 25 2026 2:22 PM

Massive Explosion At Scrap Shop In Ramanthapur Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: రామంతపూర్‌ చర్చ్‌ కాలనీలో భారీ పేలుడు సంభవించింది. స్క్రాప్‌ షాపులో లోహాన్ని కట్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు తర్వాత షాపులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో స్క్రాప్‌ డీలర్‌ పరశురామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

బాధితుడిని అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి శరీరంలో సుమారు 70 శాతం కాలినట్లు సమాచారం. పరశురామ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న రెండు అగ్నిమాపక వాహనాలు.. మంటలను అదుపులోకి తెచ్చాయి.

ఇదీ  చదవండి: మనసెలా వచ్చిందమ్మా..?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement