పాలమూరు ప్రాజెక్టు.. డీకే అరుణకి గుత్తా కీలక సూచన | gutha sukender reddy Key Suggestion To MP DK Aruna | Sakshi
Sakshi News home page

పాలమూరు ప్రాజెక్టు.. డీకే అరుణకి గుత్తా కీలక సూచన

Oct 25 2026 11:56 AM | Updated on Oct 25 2026 12:36 PM

gutha sukender reddy Key Suggestion To MP DK Aruna

సాక్షి, నల్లగొండ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించేలా బీజేపీ ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు విషయంలో డీకే అరుణ మాట్లాడిన మాటలు సరికావని విమర్శలు గుప్పించారు. నల్లగొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా.. ఏ జిల్లా నీరు ఆ జిల్లాకే పరిమితం కావాలంటే కర్ణాటక నుంచి దిగువకు చుక్క నీరు కూడా రాదని గుత్తా వ్యాఖ్యానించారు. ఏఎంఆర్పీ ద్వారా ఏడాది పొడవునా 30 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినట్లు గుత్తా పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనల మేరకే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.

గత ప్రభుత్వాలు కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. నీటి పంపకాల విషయంలో వివాదాలకు దిగితే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగమే నష్టపోతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

ఇదీ చదవండి: ఇద్దామా... ఆగుదామా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement