‘నాలుగు సార్లు హత్యాయత్నం.. రక్షణ కల్పించండి సారు’

Man Lodged Complaint Police Station Over Attack On Him Hyderabad - Sakshi

సాక్షి,హైదరాబాద్: తనపై నాలుగు పర్యాయాలు హత్యాయత్నం జరిగిందని.. తనకు రక్షణ కల్పించాలని కింగ్‌కోఠి వాసి అలీబాగ్దాదీ కోరారు. శుక్రవారం కింగ్‌కోఠి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సంవత్సరకాలంలో నాలుగు సార్లు తనను హతమార్చేందుకు కొందరు దాడి చేశారన్నారు. ఈ విషయాలపై నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు చేశానని.. కేసులు కూడా నమోదయ్యాయన్నారు.

ఇప్పటి వరకు ఎవరినీ పట్టుకోనందున మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి కింగ్‌ కోఠిలోని ఎస్‌బీఐ వద్ద బైక్‌పై వెళ్తున్న నలుగురు తనపై రాడ్లతో దాడి చేశారన్నారు. మోకాలు, చేతికి గాయాలు అయ్యాయన్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపతి గట్టుమల్లు మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాడులు జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top