ప్రేమించలేదంటూ యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి | Man Attack On Woman Over Love Matter At Secunderabad | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదంటూ యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

Aug 4 2021 4:14 PM | Updated on Aug 4 2021 5:12 PM

Man Attack On Woman Over Love Matter At Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో ఈ ఘటన జరిగింది. యువతకి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం యువకుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి దమ్మైగూడకు చెందిన గిరీష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement