ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు | Lover Protest infront of Boyfriend Home Medak | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు

Aug 8 2020 7:36 AM | Updated on Aug 8 2020 7:36 AM

Lover Protest infront of Boyfriend Home Medak - Sakshi

ఇంటి ఎదుట బైఠాయించిన యువతి

మద్దూరు(హుస్నాబాద్‌): ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని అరుజన్‌పట్ల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారంగ్రామానికి చెందిన సురేష్‌గౌడ్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకొని తీరా పెళ్లి చేసుకోమని అడిగితే నీ కులం వేరు అంటున్నాడని తెలిపింది. దీంతో మద్దూరు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు రక్షించి సురేష్‌గౌడ్‌ ఇంటి ఎదుట బైఠాయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement