అన్‌లాక్‌ ఫ్రెండ్‌షిప్‌

Lockdown Time Friendship Day 2020 Special Story - Sakshi

నేడు ఫ్రెండ్‌షిప్‌ డే 

ఫ్రెండ్‌షిప్‌ డే వస్తుందంటే హడావుడి అంతా ఇంతా కాదు.. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దల దాకా ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఎన్నో ఏర్పాట్లు చేసుకునేవారు..  ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు, గిఫ్టులతో మార్కెట్లు కళకళలాడేవి.. రెస్టారెంట్లు, పబ్స్‌ ముస్తాబయ్యేవి.. షాపింగ్‌ మాల్స్‌ బంపర్‌ ఆఫర్లు ప్రకటించేవి.. కోవిడ్‌–19 కారణంగా లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్‌ అవుతున్నా.. ఎక్కడి వారు అక్కడే ఫ్రెండ్‌షిప్‌ డే వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. హంగు ఆర్భాటాలకు పోకుండా ఫోన్లలోనే శుభాకాంక్షలు తెలుపుకుంటామని పలువురు అంటున్నారు. ఫ్రెండ్‌షిప్‌ డే    సందర్భంగా పలువురు సాక్షితో ముచ్చటించారు.  

సాక్షి, హైదరాబాద్‌: వ్యక్తిత్వాల మధ్య వికసించిన స్నేహానికి నిర్వచనం అవసరం లేదేమో..! కొన్ని స్నేహాలకి బాల్యం బాటలు వేస్తుంది. ఇంకొన్ని నేస్తాలకి చదువులు, కాలేజీలు బాసటగా నిలుస్తాయి..! ఐతే మరికొన్ని స్నేహబంధాలను అభిరుచులు, ఆలోచనలు కలుపుతాయి. అలా మమేకమైన మిత్రద్వయం అరవింద్‌ పకిడే–భరత్‌ రామినేని. వీరు ఎంచుకున్న దారులు వేరైనా చేరాలనుకున్న గమ్యం మాత్రం ఒక్కటే. అరవింద్‌కి గతించిన చరిత్రని, సంస్కృతిని వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడం అభిరుచి. తెలంగాణకు చెందిన చారిత్రక కట్టడాలను. శాసనాలను, సంస్కృతిని, మనకు తెలియని మహోజ్వల వారసత్వ సంపదను తన పరిశోధనల ద్వారా వెలికి తీసి ప్రపంచానికి చూపిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లోని దాదాపు 1100 గ్రామాలు సందర్శించి చరిత్ర గర్భంలో అంతరించిపోతున్న వందల సంవత్సరాల సంపదని గుర్తించి, వాటి విశేషాలను గూగుల్‌లో నిక్షిప్తం చేస్తున్నాడు.

తను సేకరించిన సమాచారం మేరకు విదేశీ సైంటిస్టులు సైతం ఇక్కడకొచ్చి రీసెర్చ్‌ చేయడం విశేషం. భరత్‌కేమో ప్రాచీన విశిష్ట సంపదను భ్యవిషత్‌ తరాలకు ఆధారాలుగా తన ఫొటోగ్రఫీతో బంధించడం ఇష్టం. ప్రకృతిలో ఉన్న నిగూఢార్థాన్ని బయటపెడుతూ, జీవితంలో ఇమిడి ఉన్న సంస్కృతి, సంప్రదాయాలకు ఫొటోలతో ప్రాణం పోస్తుంటాడు. కరోనా కలి్పంచిన కాస్త విశ్రాంతి సమయంలో ఈ మిత్రులు ‘ది అన్‌టోల్డ్‌ తెలంగాణ’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించారు. ఈ ఛానెల్‌ ద్వారా వారు వెలికితీసిన చారిత్రాత్మక వింతలు, విశేషాలను యావత్‌ సమాజానికి చేరువ చేస్తున్నారు. 

‘లాక్‌డౌన్‌ విధించిన వారం తర్వాత మాకు అర్థం అయ్యింది. ఇది ఇప్పుడే ఎండ్‌ అయే పరిస్థితి లేదని.. అంటే మాకు చాలా కాలం వర్క్, ఇన్‌కమ్‌ ఉండదని’ అంటూ గుర్తు చేసుకున్నారు బ్యాండ్‌ వ్యవస్థాపకులు సాయితేజ. దీనిపై తన స్నేహితుడు, బ్యాండ్‌లో సౌండ్‌ ఇంజినీర్‌ అభ్యుదయ్‌తో కలిసి ఆలోచించాడు. ‘బయటకు వెళ్లి పెర్ఫార్మ్‌ చేయడం ఇప్పుడప్పుడే కుదరదు.. సో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ మీదే లైవ్‌ ఇన్‌ సింక్‌లో ఏదైనా చేయాలి అనుకున్నాం.. మా మ్యుజిషియన్స్‌ ఎక్కడెక్కడో ఉండి కూడా అంతా కలిసి ఒక ఈవెంట్‌ చేయవచ్చా? అని జూమ్‌ ద్వారా ట్రై చేస్తే అది సాధ్యం కాదని తేలింది. కొందరు వెబ్‌ డెవలపర్స్‌తో మాట్లాడాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైవ్‌ శైలుల్ని పరిశీలించాం.

ఈ లాక్‌డౌన్‌ 2 నెలలు కష్టపడి అత్యున్నత నాణ్యతతో అచ్చంగా లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ చూసిన ఫీల్‌ ఇచ్చేలా ఎకోస్‌ ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేశాం. దీనికి కొందరు టెక్నీషియన్స్‌ సాయం తీసుకున్నాం. మా బ్యాండ్‌కి దాదాపు కేరాఫ్‌గా మారిపోయిన మూన్‌షైన్‌లో అయితే వ్యూయర్స్‌కి మరింత నాచురల్‌గా అనిపిస్తుందని అక్కడే మా ఫస్ట్‌ పెర్ఫార్మెన్స్‌(డిజిటల్‌) ప్లాన్‌ చేశాం. ఎకోస్‌ ద్వారా సిటీలోని మ్యూజిక్‌ లవర్స్‌కి ఐ ఫీస్ట్‌ అందించాం’ అని చెప్పారు తేజ. ఈ పెర్ఫార్మెన్స్‌కి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు వీరు మరిన్ని ప్రదర్శనలకు, మరెవరైనా ప్రదర్శనలు ఇస్తే వారికి ఎకోస్‌ వేదికను అందించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే గాయని చిన్మయి ప్రదర్శనకూ సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.  

వర్చువల్‌ జుంబా పార్టీ సృష్టి.. 

  • ఫ్రెండ్‌షిప్‌ డే కోసం స్పెషల్‌  
  • లాక్‌డౌన్‌ టైమ్‌లో డిజైన్‌ చేసిన స్నేహితురాళ్లు 

సిటీలో పరిస్థితుల కారణంగా పారీ్టలు ఎంజాయ్‌ చేయలేక డల్‌గా మారిన యూత్‌కి ఫుల్‌ జోష్‌ పంచారు నగరానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు. 2 నెలలుగా వీరు ప్లాన్‌ చేసి ఫ్రెండ్‌ షిప్‌ డే కోసం సమరి్పంచిన వర్చువల్‌ జుంబా పార్టీ ఫర్‌ ఫ్రెండ్స్‌ సిటీ యూత్‌ని ఉర్రూతలూగించింది. కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో టీజర్‌ యాడ్స్‌తో సందడి చేస్తున్న ఈ పార్టీని ఇద్దరు   ఫ్రెండ్స్‌ డిజైన్‌ చేయడం విశేషం. నగరంలో నివసించే ల్యాగ్స్‌గా పాపులరైన జగత మురళీ ధరణ్‌ జుంబా, బచతా, సల్సా వంటి డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌ స్టైల్స్‌కు ట్రైనర్‌గా సిటీలో ఫేమస్‌. అలాగే మరో జుంబా ట్రైనర్‌ తన స్నేహితురాలు అభిజ్ఞ ఉత్తలూరు కూడా చాయ్‌ బిస్క్, కిర్రాక్‌ స్టైల్స్‌ ద్వారా పాపులర్‌.

కొన్నేళ్లుగా వీరి మధ్య ఉన్న స్నేహం లాక్‌డౌన్‌ తర్వాత కొత్త షేప్‌ తీసుకుంది. ఇద్దరూ కలిసి సిటీలో ఫ్రెండ్‌ షిప్‌ డే సంబరాలకు తమదైన ఫిట్‌నెస్‌ అందించాలనుకున్నారు. జూమ్‌ యాప్‌తో నిర్వహించిన ఈ పారీ్టల్లో ప్రతి ఒక్కరూ తమ బెస్ట్‌ ఫ్రెండ్‌తో కలిసి పాల్గొనాలని కోరారు. నగరంలో ఇద్దరు జుంబా ట్రైనర్లు అది కూడా వర్చువల్‌లో జుంబా సెషన్‌ నిర్వహించి సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు.

ఈ ఎకోస్‌ ప్రాజెక్ట్‌కి ప్రాథమిక పెట్టుబడిగా ఈ ఇద్దరు స్నేహితులు రూ.70 వేల దాకా ఖర్చు చేశారు. బహిరంగ ప్రదర్శనలకు అవతల మ్యూజిక్‌ ఈవెంట్స్‌కి కొత్త దారి చూపించారు. ‘పెర్ఫార్మెన్స్‌ సాగుతుండగానే వీడియో ఎడిటింగ్‌ వగైరాలు కూడా మా ఎకోస్‌ ద్వారా చేసేయవచ్చు. అంటే ప్రదర్శన పూర్తి కాగానే పూర్తిగా ఎడిట్‌ అయిన రికార్డెడ్‌ ప్రోగ్రామ్‌ అప్‌లోడింగ్‌కి అందుబాటులో ఉంటుంది’ అంటూ చెప్పిన తేజ ఇకపై ఈ ఎకోస్‌ ద్వారా మరిన్ని కార్యక్రమాలు అందించనున్నామన్నారు. అన్ని రకాల బ్రాడ్‌ కాస్టింగ్స్‌కూ ఇది వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌గా ఉండబోతోందని తేజ పేర్కొన్నారు.

గత నెలలో ఓ వారాంతపు రోజు.. రాత్రి 8 గంటల సమయం.. సిటీలోని సంగీత ప్రియులు ఇష్టమైన పానీయాలు తాగుతూ.. నచి్చన ఫుడ్‌ ఎంజాయ్‌ చేస్తూ.. ఫిలింనగర్‌లోని ఓ క్లబ్‌లో ఏర్పాటైన సిటీ టాప్‌ బ్యాండ్‌ క్యాప్రిసియో బృందం లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. అదేంటీ లాక్‌డౌన్‌ టైమ్‌లో ఇదెలా సాధ్యం? ఆ ప్లేస్‌కి ఎలా వెళ్లారు? అంటూ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు సిటీలోని మ్యూజిక్‌ లవర్స్‌ ఎక్కడి వాళ్లు అక్కడే ఎవరి ఇళ్లలో వాళ్లే ఉన్నారు. కానీ అచ్చమైన లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ని ఆస్వాదించారు. అదెలా అంటే అదే మా ఎకోస్‌ అని సగర్వంగా చెబుతున్నారు ఎకోస్‌ని సృష్టించిన ఇద్దరు స్నేహితులు తేజ, అభ్యుదయ్‌.

వీకెండ్‌ విందుల్లేవు.. వినోదాల్లేవు.. వీనుల విందు చేసే సంగీత బృందాల ప్రదర్శనలు లేవు. వారాంతపు సందడిని ఆస్వాదించడం అలవాటైన వారికి అది లేకపోవడం మాత్రమే లోటు. అయితే ఆ సందడిని అందించే వారికి మాత్రం ఆదాయం దగ్గర్నుంచి అన్నీ లోటే. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి సిటీలోని టాప్‌ బ్యాండ్స్‌లో ఒకటైన కాప్రిసియో బ్యాండ్‌కు చెందిన ఇద్దరు ఫ్రెండ్స్‌ ఆలోచనలకు పదను పెట్టారు. డిజిటల్‌ వేదిక ఎకోస్‌ డిజైన్‌ చేసి అదరగొట్టారు.

వర్తమానం లేదు.. అంచనాకు అందని భవిష్యత్‌..  
నగరంలో ఈవెంట్స్‌ ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది. కరోనా పూర్తిగా కాటేసిన రంగాల్లో ఇది నెంబర్‌ వన్‌ అని చెప్పాలి. అందులో భాగమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈవెంట్స్, దానిపై ఆధారపడిన మ్యుజిషియన్స్, ఇతర ఆరి్టస్ట్‌లు ఉపాధి కోల్పోయారు. ఇటీవలే నగరంలో బాగా పాపులరైన కాప్రిసియో బ్యాండ్‌ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీలేదు. కొందరు ఫ్రెండ్స్‌ కలిసి ప్రారంభించిన ఈ బ్యాండ్‌ లాక్‌డౌన్‌కు ముందు సిటీలో బాగా సందడి చేసేది. కానీ లాక్‌డౌన్‌ తర్వాత సౌండ్‌ లెస్‌ అయిపోయింది. దీంతో అకస్మాత్తుగా వచ్చి పడిన ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలా అని ఈ ఫ్రెండ్స్‌ ఆలోచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top