తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్‌ సాయం | KTR Helps To Telangana Activist Kolluri Chiranjeevi | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమకారుడికి అండగా కేటీఆర్‌

Feb 27 2021 6:16 PM | Updated on Feb 27 2021 7:01 PM

KTR Helps To Telangana Activist Kolluri Chiranjeevi - Sakshi

కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

సాక్షి, హైదరాబాద్‌ : తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తడంతో పాటు మూత్రపిండాల పనితీరు మందగించడంతో ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌మీద చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.10 లక్షలు తక్షణమే విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డా. చిరంజీవి పుట్టినరోజునే ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని కేటీఆర్ ఆదుకోవడం ఎప్పటికీ మరిచిపోలేమని కుటుంబసభ్యులు తెలిపారు.

చదవండి: మంత్రి తలసానిపై దాసోజు శ్రవణ్‌ తీవ్ర విమర్శలు

‘కేటీఆర్‌ పీఏ’నంటూ ఫోన్‌.. డబ్బు డిమాండ్‌ 

రాంగ్‌ రూట్‌లో బైకర్‌.. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement