'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..? | Koya Wedding Card | Sakshi
Sakshi News home page

'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?

Feb 26 2025 8:45 AM | Updated on Feb 27 2025 6:05 PM

Koya Wedding Card

భద్రాద్రి కొత్తగూ­డెం జిల్లా: మాతృభాషపై మమకారంతో ఓ ఆదివాసీ కుటుంబం పెళ్లి శుభలేఖ (ఉండమీరి పెళ్లి జోడ)ను కోయ భాషలో ముద్రించి ప్రత్యేకత చాటు­కుంది. భద్రాద్రి కొత్తగూ­డెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka Village) గ్రామా­నికి చెందిన సున్నం (ఉండం) సాధు సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌లో జీవనం సాగించేవారు. 

ఆయన మరణానంతరం పెద్ద కుమారుడు బాలరాజు కుటుంబ బాధ్యతలు చూస్తున్నాడు. కాగా, సోదరుడు శ్రీనివాస్‌ వివాహం లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన చింత వినీతతో మార్చి 2న జరగనుంది. దీంతో సోదరుడి వివాహ ఆహ్వాన పత్రికను కోయ భాషలో (Koya Language) ముద్రించి బంధు మిత్రులకు పంపిణీ చేశారు. కాగా, అంతరించిపోతున్న భాషను బతికించేందుకు బాలరాజు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.

చ‌ద‌వండి: వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం

 

Advertisement
 
Advertisement
Advertisement