రైతుల అభిమానం పొందిన నేత వైఎస్సార్‌: కోమటిరెడ్డి

komatireddy Venkat Reddy Slams KCR Over Paddy Issue In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి మరొక లీడర్ మళ్లీ రాడని, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు.శనివారం కోమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత కరెంటు ఇచ్చి రైతుల అభిమానం వైఎస్సార్‌ పొందారని తెలిపారు. 

చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలే ఆయనను ప్రతిపక్షంలో కూర్చో బెట్టాయని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో చాలా గొడవలు ఉన్నాయని, రేవంత్‌రెడ్డి రాష్ట్రం మొత్తం గెలిపించలేడని అన్నారు. మహాబూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి, నల్గొండలో తాము గెలుపించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు టీపీసీసీ అధ్యక్షపదవి ఇవ్వలేదని ఇన్ని రోజులు బాధపడ్డానని, అయితే తనకు కాంగ్రెస్ పార్టీలో ఎవరితో వైరుధ్యాలు లేవని స్పష్టం చేశారు.

చదవండి: ‘విత్‌డ్రా’మా.. వివాదం.. ‘టీఆర్‌ఎస్‌ నేతలు సంతకం ఫోర్జరీ చేశారు.. కోర్టుని ఆశ్రయిస్తా’

వానకాలం వరిధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వరి ధాన్యం మార్కెట్‌లోకి తీసుకొచ్చి కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వానకాలం వరి ధాన్యం కనుగోలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top