ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్‌ విడుదల.. ఇక ఉప ఎన్నిక.. | Khairatabad Assembly Seat Declared Vacant Official Gazette Issued | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్‌ విడుదల.. ఇక ఉప ఎన్నిక..

Sep 28 2026 5:39 PM | Updated on Sep 28 2026 7:11 PM

Khairatabad Assembly Seat Declared Vacant Official Gazette Issued

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు త్వరలోనే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ స్థానం ఖాళీ అయినట్లు సోమవారం గెజిట్‌ విడుదలైంది. దానం నాగేందర్‌ అనర్హతపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో త్వరలో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది.

ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా హైకోర్టు తీర్పునే సమర్థించడంతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో ఏర్పడిన ఖాళీ స్థానంలో 6 నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.

వచ్చేనెల 6న దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ‍స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిశాయి. దీంతో ఆ రోజున ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. మరోవైపు, ఇప్పటికే ఆయా పార్టీలు ఉప ఎన్నికపై వ్యూహాలు రచించడం ప్రారంభిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో దిమ్మతిరిగే ఫలితాలు వస్తాయని దానం నాగేందర్‌ పలు వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో సత్తాచాటుతామని తెలిపారు. 

దానం నాగేందర్ అనర్హతపై అధికారిక ప్రకటన

ఇదీ చ‌ద‌వండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement