
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తాజా ఉత్తర్వులతో ఆయిల్ ఫెడ్ సంస్థకు వరుసగా నాలుగోసారి కూడా కంచర్ల చైర్మన్‌గా నియమితుల య్యారు.
మొదట 2018లో 2020 వరకు అవకాశం ఇవ్వగా, తరువాత 2020 నుంచి 2021 వరకు, అనంతరం 2021 నుంచి 2022 జూలై వరకు చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుత ఉత్తర్వులతో 2024 జూలై వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. నాలుగోసారి కూడా తనకే చైర్మన్‌గా అవకాశమివ్వడంతో సీఎం కేసీఆర్‌కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌తో కంచర్ల రామకృష్ణారెడ్డి.
చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గ్యాదరి కిశోర్