ఊరు మొత్తం ఖాళీ, మళ్లీ రాత్రికే.. | Kamareddy Villagers Went To Picnic To Avoid Corona | Sakshi
Sakshi News home page

ఊరు మొత్తం ఖాళీ, మళ్లీ రాత్రికే..

Oct 11 2020 3:15 PM | Updated on Oct 11 2020 3:37 PM

Kamareddy Villagers Went To Picnic To Avoid Corona - Sakshi

సాక్షి, కామారెడ్డి : కరోనా మహమ్మారి పీడ పూర్తిగా విరగడ అయిపోవాలని కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మొత్తం వింత ఆచారాన్ని పాటించింది. ఒకరోజు ఊరంతా ఖాళీ చేసి గ్రామస్తులందరూ వన భోజనాలకు వెళ్లారు. ఈ  సంప్రదాయం బీబీ పేట మండల కేంద్రంలో కనిపించింది. కరోనా నేపథ్యంలో ఆదివారం కూడా జనాలు అందరూ ఊరు విడిచి బయట ఉండాలని నిర్ణయించారు. కరోనా నియంత్రణలోకి రావాలనే ఉద్దేశ్యంతో గ్రామ దేవతలకు పూజలు ఘనంగా పూజలు చేశారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపులు తీశారు. అనంతరం వన భోజనాలకు వెళ్లారు. మళ్లీ రాత్రిలోగా ఊళ్ళోకి రావాలని తీర్మానించుకున్నారు. ఎలా చేయడం ద్వారా గ్రామ దేవతలు తమ గ్రామాన్ని చల్లగా చూస్తారని, కరోనా లాంటి వ్యాధులు దరి చేరకుండా దేవతలు ఆశీర్వదిస్తారని బీబీ పేట గ్రామస్తుల విశ్వాసం. కామారెడ్డి జిల్లాలో మరో రెండు గ్రామాలు నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామం లోనూ ఇలాంటి కట్టుబాట్లే కనిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement