బంజారాహిల్స్‌: కత్తితో ప్రియురాలి ఇంటికి.. చివరికి ఏమైందంటే

Jubilee hILLS: man Went To Lover house With Knife, What happens Next - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: అమెజాన్‌లో కొనుగోలు చేసిన జాంబియా(కత్తి) తీసుకొని తన మాజీ ప్రియురాలి వద్దకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉండటంతో యువతి డయల్‌ 100కు ఫోన్‌ చేయగా హుటాహుటిన జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడితో పాటు ప్యాంట్‌లో పెట్టుకున్న జాంబియాను స్వాదీనం చే సుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్పీఆర్‌హిల్స్‌ సమీపంలోని కారి్మకనగర్‌ ఎన్‌ఎస్‌బీ నగర్‌లో నివసించే యువతి(23) గతంలో జూబ్లీహిల్స్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసేది.

బోరబండ సమీపంలోని బంజారానగర్‌లో నివసించే జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్‌ బండారి శ్రీకాంత్‌(24) తరచూ ఆ హోటల్‌లో పబ్‌కు వెళ్లినప్పుడు యువతి తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమదాకా దారి తీసింది. ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో బాధితురాలు 2020 అక్టోబర్‌లో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదు చేయగా శ్రీకాంత్‌ను ఆ కేసులో అరెస్ట్‌ చేశారు. ఒకరి జోలికి ఒకరు రాకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 11.55 గంటల ప్రాంతంలో తన సోదరుడి కొడుకు బర్త్‌డే ఉండటంతో శ్రీకాంత్‌ అక్కడికి వచ్చి పీకలదాకా మద్యం సేవించాడు.

పథకం ప్రకారం జాంబియాను జేబులో పెట్టుకొని మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తప్పతాగిన మైకంలో తూలుతూ ఇంట్లోకి వచి్చన శ్రీకాంత్‌ను చూసి బాధితురాలు, ఆమె సోద రి భయాందోళనలకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా అతడి వద్ద ఉన్న పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top