తేట తెలుగులో.. టెక్కీ పాఠాలు | Join Devops Founder Sivakumar Reddy Inspiring Journey | Sakshi
Sakshi News home page

తేట తెలుగులో.. టెక్కీ పాఠాలు

Aug 16 2025 8:09 PM | Updated on Aug 16 2025 8:12 PM

Join Devops Founder Sivakumar Reddy Inspiring Journey

భాష అవరోధాలను తొలగిస్తున్న జాయిన్ డేవాప్స్

టైయర్ 2 నగర వాసులకు టెక్‌ గురు శివకుమార్ రెడ్డి

హైదరాబాద్: తెలుగు రాష్టాల్లోని మారుమూల గ్రామాల నుంచి ఎంతో కష్టపడి మేధావులుగా మారిన, ఆంగ్ల భాషపై పట్టు లేక ఎంతో మంది ఉన్నత అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఇదే ఆ యువకుడిని ఆలోచింపజేసింది. నైపుణ్యానికి భాషా ప్రావీణ్యం ఏమాత్రం అడ్డంకి కాకూడదనే ఆలోచన ఎడ్యుటెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడిని చేసింది. విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉన్న ఐటీ రంగంలో భాషా నైపుణ్యాలు ఎదిగేందుకు అవరోధాలు కాకూడదనే సంకల్పంతో మొదలైన శివకుమార్ రెడ్డి ప్రయాణం జాయిన్ డెవాప్స్ వ్యవస్థాపకుడిని చేసింది.

ఐటీ రంగంలో తనకున్న దశాబ్ద కాలం అనుభవాలను రంగరించి భాషా నైపుణ్యాలను చేదిస్తూ ఉన్నత ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా ఎడ్యుటెక్ స్టార్టప్‌తో ఎంతో మంది యువతకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకుడిగా నిలిపింది. ఐటీ రంగంలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. వందలాది స్టార్టప్‌లూ నగరంలో పురుడు పోసుకుని ఖండంతరాలకు విస్తరిస్తున్నాయి.

అలాంటిదే శివకుమార్ రెడ్డి స్థాపించిన జాయినొవాప్స్, తెలుగు మాట్లాడే ప్రొఫెషనల్స్ కోసం భాషా అడ్డంకులను తొలగిస్తూ, అతి తక్కువ ఖర్చుతో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా టెక్ రంగంలో డెవాప్స్ శిక్షణనిచ్చే సంస్థగా ఎదిగింది. భాషా నైపుణ్యాలు లేక జీవితాలను మలుపు తిప్పే అవకాశాలను చేజార్చుకుంటున్న ఎంతో మంది యువతకు ఇదొక చుక్కానిలా నిలుస్తోంది. తెలుగు భాషలో అత్యాధునిక టెక్ నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ ఎదిగింది. ఈ స్టార్టప్ టియర్-2, టియర్-3 నగరాల నుండి వచ్చిన యువతను గ్లోబల్ ఐటీ రంగంలో విజేతలుగా నిలబట్టడానికి ఎంతగానో కృషి చేస్తోంది.

సింగపూర్ అనుభవాలే.. స్టార్టప్‌కు నాంది
ఐటీ రంగంలో స్థిరపడిన శివకుమార్ మెరుగైన అవకాశాలను దక్కించుకుంటూ ఖండాంతరాలకు విస్తరించారు. దశాబ్ద కాలం అనుభవంతో సింగపూర్‌లో పలు ప్రధాన ఐటీ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఇవేవి తనకు సంతృప్తినివ్వలేదు. తనలాగే మారుమూల గ్రామీణ ప్రాంతాలను నుంచి అంచెంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఎంతో మందికి స్పూర్తితో.. తాను కూడా అలాంటి మెరికలను ఐటీ రంగానికి అందించాలనే నిర్ణయంతో జాయిన్ డెవాప్స్‌కు ఊపిరి పోశారు. అనుభవం నుంచి ఉద్భవించిన ఆలోచనకు కార్య రూపమే ఈ జాయిన్ డెవాప్స్ కాగా, స్కీల్లింగ్ ఇకోసిస్టమ్‌లో భాషా నైపుణ్యాలు లేక వెనుకబడిన ఎంతో మందిని ప్రత్యక్షంగా చూశారు. నైపుణ్యాభివృద్ధిలో గుర్తించిన అంతరాన్ని తెలుగు ఆధారిత శిక్షణతోనే టెక్ రంగంలో స్థిరపడే విధంగా సన్నద్ధం చేయాలని ఈ స్టార్టప్‌ను 2020లో స్థాపించారు.

ప్రతిభకు భాష అవసరమే లేదు..
ప్రతిభకు భాషతో అవసరమే లేదు. కానీ సరైన సమయంలో సమర్థుడిని నిరూపించుకోవడంలో భాషనే కీలకంగా మారింది. ఇదే గొప్ప అవకాశాలను చేజారిపోయేలా చేస్తోంది. ఈ సమస్యను మార్చడానికి జాయిన్ డెవాప్స్ ద్వారా ప్రాంతీయ భాషలో టెక్‌ కోర్సులను మిళితం చేసి శిక్షణ వేదికను ఏర్పాటు చేశాడు. 2026 నాటికి 20.5 బిలియన్ డాలర్లకు చేరుకునేలా జాయిన్‌ డెవాప్స్‌ అధిక డిమాండ్ ఉన్న రంగంలోకి తీసుకెళ్లారు. ఆధునాతన టెక్నాలజీ సాయంతో క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్‌లో వృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో శిక్షణార్థులను సన్నద్ధం చేయడం, ప్రతిభతో మెరుగైన అవకాశాలను అందుకునేలా యువతను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ దూసుకుపోతుంది.

ఎన్నో ప్రత్యేకతలు..
తెలుగులో ఐటీ శిక్షణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన శిక్షణార్థులు భాషా అడ్డంకులు లేకుండా సంక్లిష్టమైన ఐటీ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ భావనలను అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంత తెలుగులోనే శిక్షణనిస్తున్నారు.

వరల్డ్ క్లాస్ కరిక్యులమ్:
మొదటి రోజు నుంచి విద్యార్థులు ఎంటర్ప్రైజ్ పరిసరాలను ప్రతిబింబించే ప్రాజెక్ట్ ఆధారిత శిక్షణలో పాల్గొంటారు. ఇది వారిని టీసీఎస్‌, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలలో అవకాశాలకు సిద్ధం చేస్తోంది. దీనికోసం వరల్డ్ క్లాస్ కరిక్యులమ్తో శిక్షణ విధానం ఉంటుంది.

తక్కువ ధర:
కేవలం రూ.1,000 నుండి ప్రారంభమయ్యే ఫీజుతో జాయినొవాప్స్ మార్కెట్లో రూ.2-6 లక్షల ప్యాకేజితో ఉద్యోగ అవకాశాలను దక్కించుకునేలా నైపుణ్యాలను అందిస్తోంది.

జీవితాన్ని మార్చే ఫలితాలు:
సాధారణ డిగ్రీల నుంచి ఎంటెక్ చేసిన సరైన నైపుణ్యాలు లేక చాలీచాలనీ జీతాలతో నెట్టుకొచ్చే ఎంతో మందికి ఇదొక చుక్కానిలా నిలుస్తోంది. డెవాప్స్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దక్కించుకున్న వారికి సగటున వార్షికంగా రూ.16 లక్షల నుంచి రూ.17 లక్షల ప్యాకేజితో ఉద్యోగాలను అందుకుంటూ జీవితాలను మార్చుకుంటున్నారు.

ఇక దేశంలో అత్యధికంగా రూ. 48 లక్షలు కాగా, రూ.1.9కోట్ల వార్షిక ప్యాకేజీతో విదేశాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. దేశంలోని ఉన్నత ఐటీ సంస్థలలో, యూఏఈ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ప్లేస్మెంట్లతో జాయిన్ డెవాప్స్ శిక్షణార్ధులకు భరోసానిస్తోంది. వైజాగ్ కు చెందిన పృథ్వీరాజ్ తక్కువ జీతంలో బీపీవోలో పనిచేస్తున్నాడు. కానీ జాయిన్ డెవాప్స్ లో చేరిన అనతి కాలంలోనే టీసీఎస్‌లో డెవలపర్ ఉద్యోగం సంపాదించాడు. తాను పొందుతున్న దానికంటే పదిరెట్ల ఎక్కువ జీతంతో ఉద్యోగాన్ని పొందేలా నైపుణ్యాలను అందించింది. ఇప్పటివరకు 8,500 మంది జాయిన్ డెవాప్స్ వేదిక ద్వారా శిక్షణ పొందగా.. మెజార్టీ మంచి అవకాశాలను దక్కించుకుని జీవితాలను మార్పుకున్నారు.

టైర్-2, 3 నగరాల్లో:
ప్రాంతీయ భాషాలో స్కిల్లింగ్ ద్వారా టైర్-2 టైర్-3 నగరాలలో ఐటీ ప్రతిభా సమూహాన్ని 40-50 శాతం వరకు విస్తరిస్తూ 2027 నాటికి 2 మిలియన్లకు పైగా డెవాప్స్ ప్రొఫెషనల్స్ ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని జాయిన్ డెవాప్స్ కృషి చేస్తోంది. తెలుగులో మాట్లాడుతూ శిక్షణార్ధులకు టెక్ నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. కంపెనీలకు డెప్లొయ్మెంట్-సిద్ధంగా ఉన్న ఇంజనీర్లను అందించడంలో సహాయపడుతోంది. స్టార్టప్ యొక్క సముదాయ -ఆధారిత మోడల్ దాని విజయానికి మరో కీలకం. ఇక ఇక్కడ శిక్షణ పొందిన వారే మెంటర్లుగా తిరిగి వస్తున్నారు. శిక్షణ నాణ్యతను నిర్ధారిస్తూ, నాలెడ్జీ భాగస్వామ్యం యొక్క చక్రాన్ని పెంపొందిస్తారు.

ఉన్నత శిఖరాలకు:
జాయిన్ డెవాప్స్ ఇప్పుడు భారతదేశానికి మించి, యూఏఈ వంటి గ్లోబల్ హట్లలో తెలుగు మాట్లాడే ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని విస్తరించడంలో శివకుమార్ ప్రతిభనే కీలకం. అదునాతన క్లౌడ్ స్పెషలైజేషన్లు, కార్పొరేట్ భాగస్వామ్యాల కోసం ప్రణాళికతో టెక్ రంగంలో దూసుకుపోతుంది. "కేవలం నైపుణ్యాలను బోధించడం లేదు. ఐటీ భవిష్యత్తును మరింత శక్తివంతం చేసే ప్రతిభను నిర్మిస్తున్నాము." అని ఈ రంగంలో ఉన్న వృద్ధిని రెండు మాటల్లో శివకుమార్ వివరిస్తున్నారు. గ్లోబల్ టెక్ పవర్స్ భారత్ తన స్థానాన్ని బలోపేతం చేస్తున్నప్పుడు, జాయిన్డెవాప్స్ భాష విజయానికి ఎప్పుడూ అడ్డంకిగా ఉండకూడదని నిరూపిస్తోంది. తెలుగు ప్రొఫెషనల్స్‌ను పోటీ ప్రపంచంలో దైర్యంగా నిలిచేలా డెవాప్స్ సాయపడుతున్నందుకు గర్వపడుతున్నామని శివకుమార్ చెబుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement