హైదరాబాద్‌ ఝాముండ: ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల వీడియోలతో ఆగడాలు

Jhamunda Instagram Targets And Harassed Hyderabadi Girls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కొత్త తరహా ఆగడాలు వెలుగు చూశాయి. యువతులను లక్ష్యంగా చేసుకుని చేసుకుని.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాముండ అఫీషియల్ పేరుతో ఓ ముఠా పేట్రేగిపోతోంది. ఫిర్యాదులు అందడంతో..  పేజ్‌ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసులు లేఖ రాశారు. 

ఓ వర్గానికి చెందిన వాళ్లను టార్గెట్‌ చేస్తూ.. వీడియోలు చిత్రీకరిస్తోంది ఝూముండ అఫీషియల్ పేజీ. వీడియోలు పోస్ట్‌ చేసి ఓ వర్గం యువతులను టార్గెట్‌ చేస్తోంది ఆ ముఠా. పైగా తమ కమ్యూనిటీని డ్యామేజ్‌ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్‌ లైన్‌తో పోస్టులు చేస్తున్నారు. 

రోజు రోజుకు ఝాముండ పేజ్‌ ఆగడాలు పేట్రేగిపోతుండడంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు పేజ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top