ఆదివారం నాడు ఆఫీసుల్లో మీకేం పనయ్యా? | Telangana: Jadcherla MLA Catches Revenue Inspector Manipulating Land Records | Sakshi
Sakshi News home page

వీడియో: ఆదివారం నాడు ఆఫీసుల్లో మీకేం పనయ్యా?

Published Mon, Jun 24 2024 7:39 AM | Last Updated on Tue, Jun 25 2024 1:09 PM

Jadcherla MLA catches Revenue Inspector ‘manipulating’ land records

    బాలానగర్‌ ఆర్‌ఐపై జడ్చర్ల ఎమ్మెల్యే మండిపాటు

జడ్చర్ల: ప్రభుత్వ కార్యాలయంలో సెలవు­రోజున ఏం పనులు వెలగబెడుతున్నారంటూ ఓ ఆర్‌ఐపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే...­మహబూబ్‌­నగర్‌ జిల్లా బాలానగర్‌ తహసీల్దార్‌ కార్యాల­యంలో ఆదివారం ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి గిరప్ప­తో రెవెన్యూ రికార్డులకు సంబంధించిన నోట్స్‌ రాయిస్తున్నాడు.  విషయం తెలుసు­కున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెంటనే అక్కడికి వచ్చి ఆర్‌ఐ వెంకట్‌రెడ్డితోపాటు రికార్డులు రాస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. 

తలుపులు మూసుకొని రికార్డుల ఫైల్స్‌ రాయడం ఏమిటని ప్రశ్నించారు. జేసీ అనుమతితో సక్సేషన్‌ రాస్తున్నా­మని ఆర్‌ఐ సమాధానం ఇవ్వడంతో,  జేసీకి ఫోన్‌ కలపాలని చెప్పారు. ప్రైవేట్‌ వ్యక్తులను కార్యాలయంలోకి తీసుకొచ్చి రికార్డులు రా­యించడం ఏమిటని నిలదీశారు. సంబంధిత ఆర్‌ఐపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

 ఈ విషయమై కలెక్టర్‌కు ఫోన్‌లో ఎమ్మె­ల్యే ఫిర్యాదు చేశారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా తాము సెలవు రోజు కూడా కార్యాలయంలో పనులు చేస్తున్నామని ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. 

 Jadcherla Congress MLA Anirudh Reddy caught a Revenue Inspector who was reportedly manipulating records in MRO office, on Sunday at Balanagar Mandal pic.twitter.com/xyjf3HlVSN

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement