‘దమ్ములేకనే పొత్తు’.. పవన్‌పై అనిరుద్‌ రెడ్డి ఆగ్రహం | Jadcherla MLA Anirudh Reddy is angry with Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘దమ్ములేకనే పొత్తు’.. పవన్‌పై అనిరుద్‌ రెడ్డి ఆగ్రహం

Nov 29 2025 2:01 PM | Updated on Nov 29 2025 3:06 PM

Jadcherla MLA Anirudh Reddy is angry with Pawan Kalyan

జడ్చర్ల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే  అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సింగిల్‌గా పోయే దమ్ము లేకనే పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చిరంజీవి లేకపోతే నిన్ను ఎవ్వడు చూడరని అనిరుధ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆస్తులు కొంటున్నావనే ప్రచారం జరుగుతోందని, తెలంగాణ ప్రజలంటే అంత చిన్న చూపా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లోని ఆస్తులు అమ్మేయాలని అనిరుధ్‌.. పవన్‌ కల్యాణ్‌కు ఛాలెంజ్‌ చేశారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్‌లో ఎందుకుంటున్నావని ప్రశ్నించారు. విజయవాడలో ఉండి, ఏపీ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా నీకు? అంటూ అనిరుద్‌.. పవన్‌ కల్యాణ్‌ను నిలదీశారు.  

Advertisement
 
Advertisement
Advertisement