మంత్రి పొంగులేటికి ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుడి ఫోన్‌ | Khammam: Disabled Beneficiary’s Plea Over Indiramma Housing Bill Delay Goes Viral | Sakshi
Sakshi News home page

మంత్రి పొంగులేటికి ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుడి ఫోన్‌

Oct 17 2025 11:33 AM | Updated on Oct 17 2025 11:38 AM

Indiramma beneficiary Call To Ponguleti Srinivasa Reddy

ఖమ్మం జిల్లా: తొలుత నిర్మించిన తన కంటే ఆతర్వాత ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న పలువురికి బిల్లులు మంజూరు కావడంపై ఓ లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన దివ్యాంగుడైన తోట దాసుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మాణం మొదలుపెట్టాడు. అయితే, మొదటి బిల్లు సైతం అందకపోగా ఆ తర్వాత నిర్మాణం మొదలుపెట్టిన వారికి బిల్లులు జమ అయ్యాయి. దీంతో గురువారం దాసు ఆవేదనగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్‌ చేశాడు. ఈమేరకు స్పందించిన మంత్రి పొంగులేటి శనివారం తాను ఖమ్మం వస్తున్నానని.. ఆ రోజు తనను కలవాలని సూచించాడు. కాగా, మంత్రితో దాసు పోన్‌లో మాట్లాడిన ఆడియాలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement