మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు | Increased cold intensity in Telangana | Sakshi
Sakshi News home page

మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Dec 26 2023 2:19 AM | Updated on Dec 26 2023 2:19 AM

Increased cold intensity in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో నెలకొంటున్న మార్పు లు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మంలో 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత సిర్పూర్‌లో 8.3 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని.. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement