సత్తాచాటిన ఐఐటీహెచ్‌ | IIT Hyderabad once again excels in the World QS rankings | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన ఐఐటీహెచ్‌

Mar 26 2026 2:37 AM | Updated on Mar 26 2026 2:37 AM

IIT Hyderabad once again excels in the World QS rankings

వరల్డ్‌ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ఏడాదిలో 100 ర్యాంకులు పైకి..

హెచ్‌సీయూలో ఏడు సబ్జెక్టుల్లో గుర్తింపు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయదుర్గం: వరల్డ్‌ క్యూ ఎస్‌ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీ హెచ్‌) మరోసారి సత్తా చాటింది. 2026 సంవత్సరా నికి సంబంధించి ఇంజనీరింగ్, టెక్నాలజీ యూని వర్సిటీల ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే 395వ ర్యాంకు సాధించింది. 2025లో ఈ సంస్థ 501–550 ర్యాంకింగ్‌లో ఉండగా, ఒక్క ఏడాదిలోనే వంద ర్యాంకులు ఎగబాకడం విశేషం. ఆరు ఇంజనీరింగ్‌ విభాగాల్లో ప్రపంచంలోనే టాప్‌–300లో నిలిచింది. మొత్తం 9 సబ్జెక్టులు గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించా యి. 

మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ సిస్ట మ్స్, ఫిజిక్స్, ఆస్ట్రా నమీ వంటి విభాగాలు మరింత మెరుగుపడ్డాయి. బ్రిటన్‌కు చెందిన క్వాక్వేరెల్లి సైమ ండ్స్‌ అనే సంస్థ ఈ క్యూఎస్‌ ర్యాంకింగ్‌లు ఇస్తుంది. ఆయా వర్సి టీల అకడమిక్స్, పరిశోధనలు, ఆవిష్క రణలు, అంతర్జా తీయ సంబంధాలు వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తుంది. 

అధ్యాపకులు, విద్యా ర్థులు కలి సి అకడమిక్స్, పరిశోధనలు, ఆవిష్కర ణలో చేసిన కృషి ఫలితంగానే ఈ ర్యాంకింగ్‌లు సాధ్యమయ్యా యని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొ.బీఎస్‌ మూర్తి అన్నారు. గ్లోబల్‌ అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌పై తాము పెట్టిన సమష్టి కృషికి ఇది ప్రోత్సాహక గుర్తింపుగా నిలుస్తుందని నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సౌరభ్‌ శాండిల్య పేర్కొన్నారు.

హెచ్‌సీయూకు గుర్తింపు
హెచ్‌సీయూకు అంతర్జాతీయంగా ఏడు సబ్జెక్టుల్లో మంచి గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా 1,700కు పైగా విశ్వవిద్యాలయాల్లో 55 అకడమిక్‌ విభాగాల్లో విaద్యార్థులు తీసుకున్న 18,300కు పైగా వ్యక్తిగత విశ్వవిద్యాలయ ప్రోగ్రామ్‌ల పనితీరుపై క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకులు ఇచ్చింది. 

ఇందులో హెచ్‌ సీయూ.. లింగ్విస్టిక్స్‌ (151–200), ఇంగ్లిష్‌ భాష– లిటరేచర్‌ (251–300), సోషియాలజీ (251–300), పొలిటికల్‌ సైన్స్‌ (301–400), కెమిస్ట్రీ (401–450), ఎకనామిక్స్‌–ఎకానోమెట్రిక్స్‌ (501– 550), బయో లాజికల్‌ సైన్సెస్‌ (651–700) సబ్జె క్టుల్లో మంచి ర్యాంకులు వచ్చాయి. సబ్జెక్టుల వారీగా హెచ్‌సీయూ నిలకడగా స్థానం సంపాదించడం హర్షణీయమని ఇన్‌చార్జి వీసీ ప్రొ.జె.అనురాధ  చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement