Hyd: మైనర్ల తల్లిదండ్రులూ.. ఇది మీకోసమే! | Hyderabad Police Strict Action On Minors While Driving Vehicles | Sakshi
Sakshi News home page

Hyd: మైనర్ల తల్లిదండ్రులూ.. ఇది మీకోసమే!

May 3 2025 6:13 PM | Updated on May 3 2025 6:35 PM

Hyderabad Police Strict Action On Minors While Driving Vehicles

హైదరాబాద్: ఇటీవల కాలంలో మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు అమలు చేయడానికి నడుంబిగించారు. 

ఇక నుంచి మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ తప్పనిసరి చేయడమే కాకుండా ఏడాది పాటు ఆ వాహనం లైసెన్స్ సీజ్  చేయడంతో పాటు భారీగా జరిమానా విధించనున్నారు. అదే సమయంలో ఎవరైతే వాహనాలు డ్రైవింగ్ చేసిన మైనర్లున్నారో వారికి 25 ఏళ్ల వరకూ లైసెన్స్ జారీ కాకుండా చర్యలకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement