Traffic Restrictions In Hyderabad: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో ప్రయాణం వద్దు!

Hyderabad Freedom Ride Traffic Restrictions At IT Corridor Diversions Here - Sakshi

మధ్యాహ్నం ఒంటి గంట  నుంచి ఫ్రీడమ్‌ రైడ్‌ 

పలు ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపు

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ రావు 

గచ్చిబౌలి: స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఐటీ కారిడార్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌  డీసీపీ శ్రీనివాస్‌ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రీడమ్‌ రైడ్‌ నేపథ్యంలో దుర్గం చెరువు నుంచి   గచ్చిబౌలి వరకు పలు మార్లాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. కేబుల్‌ బ్రిడ్జి వద్ద ప్రారంభమయ్యే ఫ్రీడమ్‌ రన్‌ ఐకియా రోటరీ వద్ద కుడి వైపు , లెమన్‌ ట్రీ హహోటల్, ఫీనిక్స్‌ ఐటీ హబ్, డెల్, టెక్‌ మహీంద్రా, సీఐఐ జంక్షన్‌ మీదుగా మెటల్‌ చార్మినార్‌ వరకు కొనసాగుతుందన్నారు.

అక్కడి నుంచి ఇందిరాగాంధీ విగ్రహం, సైబర్‌టవర్‌ జంక్షన్‌లో కుడి వైపునకు వెళ్లి మెడికవర్‌ హాస్పిటల్‌ మైండ్‌ స్పైస్‌ గేట్, రోటరీలో ఎడమ వైపు టీ హబ్‌ జంక్షన్, మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్, మై హోం భూజ, ఎన్‌సీబీ జంక్షన్‌ నుంచి సైబరాబాద్‌ కమిషనరేట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, విప్రో జంక్షన్, ఐసీఐసీఐ బ్యాంక్, కోకాపేట్‌ రోటరీ, యుటర్న్‌ తీసుకొని ఐసీఐసీఐ జంక్షన్, విప్రో జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, ఎడమ వైపు టర్న్‌ తీసుకొని హెచ్‌సీయూ డిపో వద్ద యూటర్న్‌ తీసుకొని గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటుంది.  
(చదవండి: గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్‌ )

► కావూరీహిల్స్‌ జంక్షన్‌ నుంచి, గచ్చిబౌలి వైపు నుంచి జూబ్లీహిల్స్‌ వెళ్లే వాహనాలు సీఓడీ జంక్షన్‌ నుంచి మళ్లిస్తారు. సైబర్‌ టవర్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ అండర్‌ పాస్‌ నుంచి బయోడైవర్సిటీ, గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లవచ్చు. 

► రోడ్డు నెంబర్‌ 45 నుంచి ఐటీసీ కోహినూర్‌ వైపు వచ్చే వాహనాలు, గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను సీవోడీ జంక్షన్, మాదాపూర్‌ పీఎస్‌కు మళ్లిస్తారు.

► కావూరీహిల్స్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ,, సైబర్‌ టవర్‌ జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు. సైబర్‌ టవర్‌ నుంచి ఎన్‌సీబీ జంక్షన్‌ వరకు, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు అనుమతించరు. విప్రో నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ , కొత్తగూడ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు.  

► మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ట్రాఫిక్‌ పీఎస్‌ల పరిధిలో ట్రక్కులు, లారీలు, రెడిమిక్స్‌లు, డీసీఎంలకు అనుమతి లేదు.    
(చదవండి: గురుకుల పోస్టుల భర్తీ.. 9,096 కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top