
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనాలు సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 5 వరకు ఆంక్షలు అమలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్‌ఆర్ మార్గ్‌లో గణేష్ నిమజ్జనాలు ఉంటాయని జాయింట్ సీపీ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. కవాడీగూడ, బేగంపేట, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ప్లైఓవర్‌పై వాహనాలు మళ్లిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.
నగరంలో వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి.. అన్ని ప్రాంతాల్లోనూ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి.. పూజలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని మహా గణపతిని దర్శించుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు.
అలాగే గణేశ్ నిమజ్జనం సమయంలో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ నెల 29(శుక్రవారం) నుంచి సెప్టెంబర్ 5 వరకు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాల సంఖ్యను బట్టి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్‌లలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌ను నియంత్రించనున్నట్లు పోలీసులు తెలిపారు.