సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన వేళ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోడూరు - అవనిగడ్డ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ట్రాఫిక్ మళ్లింపుపై జనాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, పైగా చుట్టు తిరిగి రావాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
కోడూరు మండలంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. అయితే.. ఆయన పర్యటన కోసం పోలీసులు విధించిన డైవర్షన్ జనాలు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక తన పర్యటనలో భాగంగా.. కృష్ణాపురం వద్ద నేలకొరిగిన పంటలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఆపై అవనిగడ్డ సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించి.. స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమీక్షించారు.
‘కుదర్లేదు కాని... కుదిరితే ఆ మోంథా తుపానును పట్టుకుని తిప్పికొట్టేవారు..!’’ ‘‘ఎన్నో తుపాన్లను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించేవారు..’’ ఇదీ సీఎం చంద్రబాబు గురించి ఎల్లో మీడియాలో సాగుతున్న భజన. విపత్తులను కూడా రాజకీయ మైలేజీకి వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు తుపానును అవకాశంగా తీసుకున్నారు.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉చంద్రబాబు ప్రచార ‘విపత్తు’


