
సాక్షి, హైదరాబాద్: వినాయకచవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో.. 11 రోజులపాటు ఖైరతాబాద్ గణేషుడి పరిసర ప్రాతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపటి నుంచి (27 బుధవారం) సెప్టెంబర్ 6వరకూ ఇవి అమల్లో ఉండనున్నాయి. బడా గణేషుడి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందునే ఈ అంక్షలు విధించినట్లు నగర పోలీసులు ప్రకటించారు.
ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆరు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. భక్తులు తమ సొంత వాహనాల్లో వచ్చి ఇబ్బందులు పడకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ట్రాఫిక్ అంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రహదారుల గుండా వెళ్ళాలని పోలీసులు సూచిస్తున్నారు.
డైవర్షన్‌లు ఇవే..
ఖైరతాబాద్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు.. నిరంకారి జంక్షన్ వైపు మళ్ళింపు
ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రాజ్ దూత్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు మళ్ళింపు
ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వచ్చే వాహనాలు సెక్రటేరియట్ మీదుగా తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లింపు
నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ , ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా మళ్ళింపు
ఖైరతాబాద్ పోస్ట్ఆఫీస్ నుంచి నిరంకారి నుంచి భవన్ వైపు వచ్చే వాహనాలు ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ జంక్షన్ వైపు మళ్ళింపు