విద్యుత్ పంపిణీ సంస్థలకు డిప్యూటీ సీఎం భట్టి సూచన
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపొద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ పంపిణీ సంస్థలకు సూచించారు. డిస్కంల ఆర్థిక లోటుపై ప్రభుత్వం సరైన నిర్ణ యం తీసుకుంటుందని తెలిపారు. దీంతో పంపిణీ సంస్థలు తమ వార్షిక ఆదాయ, అవసర నివేదిక(ఏఆర్‌ఆర్)ల్లో విద్యు త్ చార్జీల భా రం లేకుండానే విద్యుత్ నియంత్రణ మండలికి తమ ప్రతిపాదనలు అందించాయి. డిస్కంల ఏఆర్‌ఆర్‌లను గురువారం ఈఆర్‌సీ ప్రజల ముందుకు తెచి్చంది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 2026–27 వార్షిక సంవత్సరానికి రూ. 22,104 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి.
నివేదికలను గత ఏడాది డిసెంబర్‌లోనే ఈఆర్‌సీ ముందుకు తెచ్చాయి. ఫిక్స్‌డ్ చార్జీల పెంపుతో పాటు, పరోక్ష విధానంలో టారిఫ్ పెంపును ప్రతిపాదించాయి. అయితే పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వీటిని బయటకు వెల్లడించలేదు. దీనిని డిప్యూ టీ సీఎం పరిశీలించి, చార్జీల పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అంగీకరించబోదని డిస్కంలకు సూచించారు. దీంతో ఏఆర్‌ఆర్ నివేదికలను సవరించి, ప్రభుత్వం నుంచి లోటును పూడ్చుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణకు వి ద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఏఆర్‌ఆర్‌లను వెల్లడించాయి. దక్షిణ డిస్కం రూ.9,583 కోట్లు, ఉత్త ర డిస్కం రూ.12,521 కోట్ల లోటులో ఉన్నట్టు ఆయా నివేదికల్లో పేర్కొన్నాయి. ఈనెల 31 వరకు డిస్కంల నివేదికపై అ భ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తారు. మార్చి 5న హనుమకొండలో, మార్చి 7న హైదరాబాద్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో బహిరంగ విచారణ జరిపి, టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేస్తుంది.
రేపు ఢిల్లీకి డిప్యూటీ సీఎం
సాక్షి. హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాష్ట్రాల అవసరాలు, అవి కోరుకుంటున్న కొత్త ప్రాజెక్టులు, విధానపర నిర్ణయాల్లో మార్పులు, కేంద్రం నుంచి నిధుల విడుదలకు వస్తున్న డిమాండ్లు, వీటన్నింటిపై ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె చర్చించనున్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించే ముందు రాష్ట్రాల డిమాండ్లు, అవసరాలకు ఏ మేరకు నిధులు కేటాయించాలో ఈ సమావేశం ఆధారంగా నిర్ణయిస్తారు.
బడ్జెట్ సన్నాహక సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు సంక్రాంతి తరువాత ప్రారంభం కానున్నాయి. అన్ని శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా వరుస భేటీలు నిర్వహించనున్నారు.


