సాక్షి,హైదరాబాద్: బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. బర్త్‌డే పార్టీ నిర్వహణ విషయంలో రెండు ట్రాన్స్‌జెండర్ గ్రూపుల మధ్య వాగ్వాదం తీవ్రంగా మారి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన బోరబండ బస్టాండ్ వద్ద ఉద్రిక్తతకు కారణమైంది. ఘర్షణ అనంతరం ఓ వర్గానికి చెందిన కొంతమంది నిరసనగా బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో 10 మంది ట్రాన్స్‌జెండర్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు
ఘర్షణకు కారణమైన అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోరబండ ప్రాంతంలో ప్రస్తుతం భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.


