
కరెంట్ షాక్ కొట్టి పడిపోయిన ఆ వ్యక్తిని బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడాడు..
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిబద్ధతను, అంతకు మించి సమయస్ఫూర్తిని కనబరిచే ఉద్యోగులను అభినందించకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటనే నగరంలో ఒకటి జరిగింది. కరెంట్ షాక్‌తో కుప్పకూలిన ఓ వ్యక్తి ప్రాణాల్ని.. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడాడు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్1లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు శంకర్. డ్యూటీలో ఉండగా.. రోడ్ నెంబర్ 1లోని జీవీకే హౌజ్ మెయిన్ గేట్ ముందర ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో పడిపోయాడని సమాచారం అందుకున్నాడు. కరెంట్ బాక్స్‌కి చెయ్యి తగిలి అతను షాక్‌కి గురయ్యాడు.
దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసి అతన్ని కాపాడాడు శంకర్. ఆపై ఆంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. ఒక ప్రాణం కాపాడిన శంకర్ అక్కడున్న వాళ్లతో పాటు అధికారులు సైతం అభినందిస్తున్నారు.