చికిత్స చేయించలేకే.. కూతురును ‘సాగర్‌’లోకి తోసిన తల్లి | Hussain Sagar Mother And Daughter Incident | Sakshi
Sakshi News home page

చికిత్స చేయించలేకే.. కూతురును ‘సాగర్‌’లోకి తోసిన తల్లి

Oct 10 2026 8:23 AM | Updated on Oct 10 2026 8:23 AM

Hussain Sagar Mother And Daughter Incident

హైదరాబాద్: పుట్టుకతోనే తన చిన్న కూతురు మలద్వారం లేకుండా జన్మించడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చికిత్స చేయించలేక  హుస్సేన్‌ సాగర్‌లో తోసేసి పరారైన విషయం తెలిసిందే. ఆటో డ్రైవర్‌ గమనించి పాపను కాపాడారు. దోమలగూడ పోలీసులు పరారీలో ఉన్న షబానాను అదుపులోకి తీసుకుని విచారించారు. ఐదేళ్ల క్రితమే భర్త రెహమాన్‌ వదిలేసి వెళ్లడంతో, షబానా ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలు మహేక్, రుక్సానాలను పోషిస్తోంది. 

ఆరేళ్లుగా గాంధీ ఆసుపత్రి చుట్టూ తిరిగినా ఆపరేషన్‌కు నిర్ణీత వయస్సు రావాలని వైద్యులు చెప్పడం, వైద్య పరీక్షలు చేయించలేక విసుగు చెందడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో ఒప్పుకుంది. ప్రస్తుతం తండ్రి రెహమాన్‌ గుంటూరులో పనిచేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజద్‌ అలీ తెలిపారు. చైల్డ్‌ ఉమెన్‌ వెల్ఫేర్‌ కమిటీ, పోలీసుల సహకారంతో చిన్నారికి గాంధీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement