సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లకు చెందిన శ్రీమతి కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తా కథనంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే, వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత , శస్త్రచికిత్సకు సంబంధించి పొందిన సమ్మతి వంటి అంశాలపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని కమిషన్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) నుంచి సమగ్ర నివేదికను కమిషన్ కోరింది. రోగికి సంబంధించిన వైద్య రికార్డులు, సూచనల మేరకు నిర్వహించిన నిర్వహించిన శస్త్రచికిత్స వివరాలు, రోగి/కుటుంబ సభ్యుల నుంచి పొందిన సమ్మతి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, నిర్వహించిన విచారణ వివరాలను నివేదికలో పొందుపరచాలని అధికారులను ఆదేశించింది.
ఏం జరిగింది ?
సిరిసిల్ల పట్టణానికి చెందిన కొమ్ము వెంకమ్మ అనే బాధితురాలు కంటి చూపు సమస్యతో బాధపడుతుంది. దీంతో సెప్టెంబర్ 28న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికత్స నిమిత్తం వెళ్లారు. పరిక్షీంచిన వైద్యులు వెంకమ్మకు ఎడమ కన్నుకు శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. అయితే శస్త్ర చికిత్స కోసం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ ముగించుకొని బయిటకు రాగా కుడి కన్నుకు ఆపరేషన్ చేసి ఉంది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై కమిషన్ విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండి:పాకిస్థాన్ స్పై నెట్‌వర్క్ కలకలం


