ఐఐటీ–హైదరాబాద్‌లో భారీ టెలిస్కోప్‌ 

Huge Telescope Setup In IIT Hyderabad To Study Astronomy For Students - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ కీలక ముందడుగు వేసింది. క్యాంపస్‌లో భారీ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ) స్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ బీఎన్‌ సురేశ్‌ సోమవారం టెలిస్కోప్‌ను ప్రారంభించారు. ఈ టెలిస్కోప్‌లో 165 మి.మీ. ఫోకల్‌ లెంగ్త్‌తో 355 మి.మీ (ఐఐటీ కాన్పూర్‌ తర్వాత రెండోది) ఆప్టికల్‌ వ్యాసం కలిగిన భారీ లెన్స్‌ ఉంటుందని సోమవారం ఐఐటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

చంద్రుడి ఉపరితలంపై చిన్న క్రేటర్‌లు, శని గ్రహ వలయాలు, ఉల్కాపాతం వంటి చిత్రాలను నమోదు చేసేందుకు వినియోగించొచ్చని పేర్కొంది. ఖగోళంపై అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు ఈ టెలిస్కోప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ మూర్తి పేర్కొన్నారు. స్టార్‌ గేజింగ్‌ శిక్షణ కార్యక్రమాలు, ఖగోళ చిత్రాలు తదితరాలపై అవగాహన పెంచుకోవచ్చని చెప్పారు. కాగా, ఐఐటీ హైదరాబాద్‌ ఆ్రస్టానమీ క్లబ్‌ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు కూడా ప్రయోజనాలు పొందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ ముయూఖ్‌పహారి పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top