పంట నష్టంపై పొంతన లేని వాదన

High Court Serious on Government Over Crop Damage In Telangana - Sakshi

ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ‘గత ఏడాది భారీ వర్షాలు, వరదల తో రాష్ట్రంలో భారీగా పం టలు దెబ్బతిన్నాయని, సాయం చేయాలంటూ ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రాన్ని అభ్యర్థించి నట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం రూ.9,400 కోట్ల నష్టం జరిగిందని, సాయం చేయాలంటూ కేంద్రానికి లేఖ రాసినట్లుగా కథ నాలు వచ్చాయి. ఇప్పుడేమో అందుకు పూర్తి విరు ద్ధంగా భారీ వర్షాలు, వరదలతో ఎటువంటి నష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు, ఇప్పుడు చేస్తున్న వాదనకు పొంతన లేదు.

రాష్ట్ర ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తోంది..’అని హైకోర్టు ధర్మాసనం మండిపడింది. గత ఏడాది భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆర్థిక సాయం కోరు తూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను బుధ వారంలోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావును ఆదేశించింది. 

నీళ్లు నిలిచి వెళ్లిపోయాయ్‌: ఏజీ
గత ఏడాది భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌ కుమార్, రవి కన్నెగంటి, ఎస్‌.ఆశాలతలు గతంలో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.

గత ఏడాది వర్షాలతో రాష్ట్రంలో పంటలకు ఎటువంటి జరగలేదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. పంట పొలాల్లో కొన్ని రోజులపాటు నీరు నిలిచిపోయినా వర్షాలు తగ్గిన తర్వాత నీరు వెళ్లిపోవడంతో పంటలకు ఏమీ నష్టం జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు.

రైతుబంధు యజమానులకేగా: ధర్మాసనం
‘రైతు బంధు వ్యవసాయ భూమి యజమానులకు మాత్రమే ఇస్తున్నారు. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయేది కౌలు రైతులే. పంట భీమా ఉంటే వారికి లబ్ధి చేకూరేది..’ అని ధర్మాసనం పేర్కొంది. 

నష్టం జరగలేదనడం అశాస్త్రీయం
‘పొలాల్లో కొన్ని రోజులపాటు నీరు నిలిస్తే çపంటలు పూర్తిగా పాడవుతాయి. నీరు నిలిచినా పంటలకు నష్టం జరగలేదనడం అశాస్త్రీయంగా ఉంది. గతం లో సాయం చేయాలని కోరామని, అయితే నష్టం జరగలేదు కాబట్టి సాయం చేయాల్సిన అవసరం లేదంటూ సీఎం, సీఎస్‌ మళ్లీ కేంద్రానికి ఏమైనా లేఖ రాశారా?’ అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

చదవండి: తెలంగాణ నుంచి ఏపీకి బదిలీలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top