
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్‌తో పాటు మరికొందరిని అనర్హులుగా ప్రకటిస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, జస్టిస్ దీపక్ వర్మ జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్‌రావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ అజారుద్దీన్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది.
చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’
చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!