Medicine From The Sky వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌తో మందుల సరఫరా

Medicine From The Sky In Telangana: Medicine Drone Delivery In Kurti - Sakshi

కామారెడ్డి జిల్లా కుర్తిలో అత్యవసర మందులు చేరవేత

ప్రభుత్వ సరికొత్త విధానానికి గ్రామస్తుల ప్రశంసలు

సాక్షి, కామారెడ్డి: దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణలో మందులు (మెడిసిన్స్‌) ఆకాశమార్గాన తరలిస్తూ మారుమూల ప్రాంతాలకు చేరువ చేసేలా ‘డ్రోన్‌ డెలివరీ’ విధానం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఆ డ్రోన్‌ విధానం ఎంతో ఉపయోగపడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు మందుల సరఫరా సులువుగా మారింది. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ప్రారంభమైన మందుల డ్రోన్‌ డెలివరీ కామారెడ్డి జిల్లాలో కూడా మొదలైంది. తాజాగా సోమవారం ఓ గ్రామానికి డ్రోన్‌ డెలివరీ విధానంలో మందులు అందించారు.
చదవండి: హెచ్‌సీఏ వివాదం.. హైకోర్టులో అజారుద్దీన్‌కు ఊరట

జిల్లాలో విస్తారంగా వానలు పడుతుండడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో పిట్లం మండలంలోని కుర్తి గ్రామానికి వెళ్లే రహదారి నీట మునిగి రాకపోకలు స్తంభించాయి. అయితే గ్రామంలో ఒకరికి అత్యవసరంగా మందులు అవసరం ఉండడంతో అధికారులు డ్రోన్‌ ద్వారా పంపించారు. డ్రోన్‌ ద్వారా మందుల రాకను గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. ఈ విధానంపై ప్రశంసలు కురిపించారు.
చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top