Viveka Case: High Court Adjourned Hearing On Avinash Reddy Anticipatory Bail Petition To April 26 - Sakshi
Sakshi News home page

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Apr 25 2023 3:25 PM | Updated on Apr 25 2023 3:49 PM

High Court Adjourned Hearing On Avinash Reddy Anticipatory Bail Petition To April 26 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు(బుధవారం) వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.

కాగా, మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో దర్యాప్తు కాల పరిమితిని సుప్రీంకోర్టు పొడిగించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా జూన్‌ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.

Advertisement
 
Advertisement
Advertisement