బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు | High Alert In Begumpet Airport | Sakshi
Sakshi News home page

బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Jun 18 2025 11:53 AM | Updated on Jun 18 2025 12:25 PM

High Alert In Begumpet Airport

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్టు దుండగులు మెయిల్‌ పంపిన పంపించడంతో పోలీసులు, అధికారులు అలర్ట్‌ అయ్యారు. అనంతరం, ఎయిర్‌పోర్టులో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. 

వివరాల ప్రకారం.. బాంబు బెదిరింపు నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు. ఎయిర్‌పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు తరలించి తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. అత్యవసర సహాయక సిబ్బందిని సైతం ఎయిర్‌పోర్టు అథారిటీ రప్పించింది. దీనిపై సైబర్ క్రైం అధికారులు.. మెయిల్ పంపిన వాళ్ల వివరాలు కనుగొనేందుకు కసరత్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement