హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. | Heavy Rain Falling In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కుండపోత వర్షం..

Sep 6 2024 5:21 PM | Updated on Sep 6 2024 6:10 PM

Heavy Rain Falling In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది.  శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, బేగంపేట, అబిడ్స్‌, కోఠి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది.  సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

 

 

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement