
సాక్షి, హైదరాబాద్: నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్, మాదాపూర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, అమీర్‌పేట సహ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే వీలుందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Rains🌧️ further spread into the most parts across City - Khairatabad, Begumpet, Kondapur, Jubilee Hills, Shaikpet, Attapur, Alwal, Malkajgiri, Musheerabad, Abids, Charminar, Rajendranagar, Uppal, LB Nagar (Near-by Areas) next 1-2 hrs#HyderabadRains https://t.co/t4cDJTf8rc
— Weatherman Karthikk (@telangana_rains) August 13, 2025
యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.