హైదరాబాద్‌లో మళ్లీ ఒక్కసారిగా వర్షం.. ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌ | Heavy Rain Fall Across Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మళ్లీ ఒక్కసారిగా వర్షం.. ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌

Sep 5 2024 7:37 PM | Updated on Sep 5 2024 8:16 PM

Heavy Rain Fall Across Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. గురువారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తోంది. జోరుగా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

కాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, మియాపూర్‌ సహా తదితర ప్రాంతాల్లో వరద కురుస్తోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement