నా మాట వినకపోతే నీ భర్త బిచ్చగాడు అవుతాడు.! | Hanamkonda Principal Suspension Woman Incident | Sakshi
Sakshi News home page

నా మాట వినకపోతే నీ భర్త బిచ్చగాడు అవుతాడు.!

Oct 8 2026 12:45 PM | Updated on Oct 8 2026 1:12 PM

Hanamkonda Principal Suspension Woman Incident

ప్రతీకాత్మక చిత్రం

గ్రేటర్‌ వరంగల్‌ : ప్రధానోపాధ్యాయుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, ఫొటో మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని స్కూల్‌ ఆయా పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటువేశారు. హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి వడ్లకొండ కుమారస్వామి విధులు నిర్వర్తిస్తున్నాడు. 

అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ అదే స్కూళ్లో ఆయాగా పనిచేస్తోంది. ఈక్రమంలో ప్రధానోపాధ్యాయుడు తనను లైంగిక వేధిపులకు గురి చేస్తున్నాడని, ‘నాకు మంత్రాలు వస్తాయి. నా మాటలు వినకపోతే నీ భర్త బిచ్చగాడు అవుతాడు. పిల్లల ప్రాణాలకు ముప్పు ఉంది’ అని బెదిరింపులకు పాల్పడినట్లు సదరు మహిళ గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో వారు హెచ్‌ఎంను మందలించారు. అనంతరం అతడు సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరవుతూ వచ్చాడు. 

ఈక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఏఐ సా యంతో కొన్ని ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రధానోపాధ్యాయు డు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, సోషల్‌ మీడియాలో ఫొటోలు మార్ఫింగ్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నాడని బా«ధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ తెలిపారు. కాగా, ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసినందుకు, సెలవుకు దరఖాస్తు చేయకుండా వి«ధులకు గైర్హాజరైనందుకు హెచ్‌ఎంపై  అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement