– మరిన్ని ఫొటోలు 9లోu
శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం కార్తీకపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగుఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు పానుగంటి ప్రణవ్, దత్తకుమార్‌శర్మ, శ్రవణ్ పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు గట్టు మహేష్‌బాబు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి లక్షదీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు కలశం, స్వస్తిక్, ఓం, పద్మం, త్రిశూలం, చతురస్రం, శివలింగాకారం తదితర రూపాల్లో దీపాలు వెలిగించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య కీర్తనల ఆలాపన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, సీఐ శివకుమార్ విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
– హన్మకొండ కల్చరల్


