భద్రకాళి దేవాలయంలో జ్వాలాతోరణం | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి దేవాలయంలో జ్వాలాతోరణం

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

భద్రకాళి దేవాలయంలో జ్వాలాతోరణం కీర్తి పురస్కారానికి పొట్లపల్లి శ్రీనివాసరావు ఎంపిక పల్స్‌పోలియో 100.2%

హన్మకొండ కల్చరల్‌: కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో మంగళవారం జ్వాలాతోరణాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి నిత్యాహ్నికం, భద్రేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణాన్ని ప్రారంభించారు. శ్రీభద్రకాళీ భద్రేశ్వరుల ఉత్సవమూర్తులను అర్చకులు జ్వాలాతోరణం నుంచి తీసుకొచ్చారు. అనంతరం అధికసంఖ్యలో భక్తులు పాల్గొని జ్వాలాతోరణాన్ని దర్శించుకున్నారు.

హన్మకొండ కల్చరల్‌: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి నగరానికి చెందిన కవి, రచయిత, తెరసం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఈనెల 26న హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకోనున్నారు. పొట్లపల్లి శ్రీనివాసరావు ఇటీవల తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాళోజీ ఫౌండేషన్‌ సంయుక్త కార్యదర్శిగా, మిత్రమండలి తదితర సాహిత్య సాంస్కృతిక కళారంగ సంస్థల్లో సేవలు అందిస్తున్నారు. పొట్లపల్లి అవార్డుకు ఎంపికై నందుకు కవులు అంపశయ్య నవీన్‌, రామచంద్రమౌళి, డాక్టర్‌ ఎల్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ బన్న అయిలయ్య, నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్‌ విద్యార్థి, గిరిజా మనోహరబాబు, ఆచార్య గడ్డం వెంకన్న, బిల్ల మహేందర్‌, గట్టు రాధిక తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా 84,654 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 84,816 మందికి చుక్కలు వేసి 100.2 శాతం లక్ష్యాన్ని సాధించారు. మూడో రోజు ఇంటింటి సర్వేను జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ కృష్ణారావు పర్యవేక్షించారు. మంగళవారం 416 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయగా.. 75,387 ఇళ్లను సందర్శించి సర్వే నిర్వహించారు. కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌ వాడీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని డాక్టర్‌ కృష్ణారావు అభినందించారు. వివిధ శాఖల సమన్వయం, సిబ్బంది అంకితభావం, సమష్టి కృషితోనే లక్ష్యాన్ని మించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement