హన్మకొండ: లేడీస్‌ హాస్టల్స్‌ టార్గెట్‌.. ఊహించని రీతిలో పోలీసులకు చిక్కాడు!

Hanamkonda Ladies Hostel thief Fall In well Police Arrested - Sakshi

క్రైమ్‌: లేడీస్‌ హాస్టల్స్‌ను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి.. అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల చోరీ కలకలం రేగింది. ఏకంగా హాస్టల్‌లో ఓ బాత్రూం డోర్‌ బద్దలు కొట్టి మరీ చోరీలు చేశాడు ఆగంతకుడు. దీంతో..

బెంబేలెత్తిన విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన సైతం చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. అందరినీ హడలెత్తించిన దొంగ ఊహించని విధంగా దొరికాడు. సెల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ను దొంగలించి రాత్రి పొలాల గుండా పారిపోతుండగా.. చీకట్లో ఓ వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఉదయం కేకలతో అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తాడు సాయంతో బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top