హన్మకొండలో ఘోర ప్రమాదం | Three Killed And 12 Members Injured As Lorry Hits Wedding Vehicle In Hanmakonda | Sakshi
Sakshi News home page

హనుమకొండ: పెళ్లి వాహనాన్ని లారీ ఢీ.. ముగ్గురు మృతి.. ఐదుగురికి సీరియస్‌

Oct 31 2025 6:36 AM | Updated on Oct 31 2025 11:45 AM

Wedding Vehicle Lorry Collid Road Accident Hanumakonda

సాక్షి, హనుమకొండ: ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

పెళ్లి బృందంతో వస్తున్న బోలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. గాయపడిన మరో 12 మందిని ఎంజీఎంకు తరలించారు. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కురవి మండలం సుధాన్‌పల్లివాసులుగా పోలీసులు నిర్ధారించారు. వాళ్ల పేర్లు వెల్లడించాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement