breaking news
	
		
	
  Elkaturti
- 
      
                   
                                                       హన్మకొండలో ఘోర ప్రమాదంసాక్షి, హనుమకొండ: ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్ క్రాస్ రోడ్డు వద్ద రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పెళ్లి బృందంతో వస్తున్న బోలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. గాయపడిన మరో 12 మందిని ఎంజీఎంకు తరలించారు. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కురవి మండలం సుధాన్పల్లివాసులుగా పోలీసులు నిర్ధారించారు. వాళ్ల పేర్లు వెల్లడించాల్సి ఉంది.
- 
      
                   
                                 కూలీ కోసం తీసుకొచ్చి చితకబాదారు..
 గదిలో నిర్బంధించి యువకులపై దాడి చేసిన మేస్త్రీ
 ఎల్కతుర్తి: బతుకుదెరువు నిమిత్తం పొట్ట చేతపట్టుకుని వచ్చిన కూలీలను ఓ మేస్త్రీ గదిలో నిర్బంధించి గురువారం రాత్రి దాడి చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలానికి చెందిన సిద్దు పెంచలయ్య, సిద్దు విజయ్(16), తుపాకుల వెంకటేష్, పోలి కుమార్‌లను వారం రోజుల క్రితం కోరుట్లకు చెందిన గురువయ్య అనే మధ్యవర్తి పని కల్పిస్తానని కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరకు తీసుకొచ్చి బండారు శ్రీను అనే మేస్త్రీకి అప్పగించాడు.
 
 యజమాని రోజూ కారం, పచ్చడితో భోజనాలు పెడుతున్నాడు. ఎంత పనిచేసినా సరిగా చేయడంలేదని దూషిస్తున్నాడు. దీంతో కూలీలు అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బుల వరకు పనిచేసి, గురువారం మధ్యాహ్నం స్వగ్రామాలకు బయల్దేరి వరంగల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మేస్త్రీ శ్రీనివాస్ ఆటోలో వరంగల్ స్టేషన్‌కు వెళ్లి వారిని మభ్యపెట్టి దామెరకు తీసుకొచ్చాడు. రాత్రి బాగా మద్యం తాగి వచ్చి కూలీలను గదిలో నిర్బంధించి విచక్ష ణారహితంగా కర్రతో చితకబాదాడు.
 
 ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించాడు. రాత్రంతా వారిని గదిలోనే నిర్బంధించి శుక్రవారం కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాడు. ఉదయం గదిలో నుంచి అరుపులు వినిపిస్తుండడంతో చుట్టుపక్కలవారు తాళం పగులగొట్టి వారిని బయటకు తీశారు. వారి శరీరాల నిండా కమిలిన గాయాలున్నారుు. గ్రామస్తుల సహకారంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


