కూలీ కోసం తీసుకొచ్చి చితకబాదారు.. | Young country boys who were captured Room attack tindal | Sakshi
Sakshi News home page

కూలీ కోసం తీసుకొచ్చి చితకబాదారు..

Jul 18 2015 3:57 AM | Updated on Aug 1 2018 2:36 PM

కూలీ కోసం తీసుకొచ్చి చితకబాదారు.. - Sakshi

కూలీ కోసం తీసుకొచ్చి చితకబాదారు..

బతుకుదెరువు నిమిత్తం పొట్ట చేతపట్టుకుని వచ్చిన కూలీలను ఓ మేస్త్రీ గదిలో నిర్బంధించి గురువారం రాత్రి దాడి చేశాడు.

గదిలో నిర్బంధించి యువకులపై దాడి చేసిన మేస్త్రీ
ఎల్కతుర్తి: బతుకుదెరువు నిమిత్తం పొట్ట చేతపట్టుకుని వచ్చిన కూలీలను ఓ మేస్త్రీ గదిలో నిర్బంధించి గురువారం రాత్రి దాడి చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలానికి చెందిన సిద్దు పెంచలయ్య, సిద్దు విజయ్(16), తుపాకుల వెంకటేష్, పోలి కుమార్‌లను వారం రోజుల క్రితం కోరుట్లకు చెందిన గురువయ్య అనే మధ్యవర్తి పని కల్పిస్తానని కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరకు తీసుకొచ్చి బండారు శ్రీను అనే మేస్త్రీకి అప్పగించాడు.

యజమాని రోజూ కారం, పచ్చడితో భోజనాలు పెడుతున్నాడు. ఎంత పనిచేసినా సరిగా చేయడంలేదని దూషిస్తున్నాడు. దీంతో కూలీలు అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బుల వరకు పనిచేసి, గురువారం మధ్యాహ్నం స్వగ్రామాలకు బయల్దేరి వరంగల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మేస్త్రీ శ్రీనివాస్ ఆటోలో వరంగల్ స్టేషన్‌కు వెళ్లి వారిని మభ్యపెట్టి  దామెరకు తీసుకొచ్చాడు. రాత్రి బాగా మద్యం తాగి వచ్చి కూలీలను గదిలో నిర్బంధించి విచక్ష ణారహితంగా కర్రతో చితకబాదాడు.

ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించాడు. రాత్రంతా వారిని గదిలోనే నిర్బంధించి శుక్రవారం కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాడు. ఉదయం గదిలో నుంచి అరుపులు వినిపిస్తుండడంతో చుట్టుపక్కలవారు తాళం పగులగొట్టి వారిని బయటకు తీశారు. వారి శరీరాల నిండా కమిలిన గాయాలున్నారుు. గ్రామస్తుల సహకారంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement