ఘనంగా ఎన్‌ఐఆర్‌డీపీఆర్ 64వ వ్యవస్థాపక దినోత్సవం

ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థ 64వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడం సమగ్రాభివృద్ధికి చాలా అవసరమన్నారు.
గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో పోటీపడుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో భారతదేశం బెంచ్‌మార్క్‌లను సాధించిందన్నారు. ఉపాంత రంగాలకు చెందిన ప్రజలకోసం ఎన్‌ఐఆర్‌డీపీఆర్ జాతీయ స్థా యి మేళాలను నిర్వహించడం ద్వారా దేశవ్యా ప్తంగా కళాకారులను ప్రొత్సహిస్తుందన్నారు.