మొబైల్‌ వ్యాక్సిన్‌ వ్యాన్‌ ప్రారంభం | GHMC launches mobile vaccination vans | Sakshi
Sakshi News home page

మొబైల్‌ వ్యాక్సిన్‌ వ్యాన్‌ ప్రారంభం

Feb 4 2022 5:16 AM | Updated on Feb 4 2022 8:39 AM

GHMC launches mobile vaccination vans - Sakshi

శేరిలింగంపల్లి: జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయంలో మొబైల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వ్యాన్‌ను జాయింట్‌ జోనల్‌ కమిషనర్‌ మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ళు నిండిన వారు రెండు డోసుల వ్యాక్సి న్‌ వేయించుకొని 9 నెలలు పూర్తి అయితే బూస్టర్‌ డోస్‌ వేస్తామన్నారు. వికలాంగులు, సిక్‌ అయిన వారికి ఇంటికే వెళ్లి బూస్టర్‌ డోస్‌ వేస్తామని వివరించారు.

శేరిలింగంపల్లి, చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని వారు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. వృద్దులు, సిక్‌ అయిన వారు బూస్టర్‌ డోస్‌ కోసం కంట్రోల్‌ రూం నెంబర్‌ 040–21111111లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్‌ఓలు డాక్టర్‌ రవి, డాక్టర్‌ కార్తీక్, పీఓ మాన్వి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement