బంతిని పట్టుకోబోయాడు.. తిరిగి లేవలేదు

Ghatkesar: A Young Man Died Suddenly While Playing Cricket - Sakshi

సాక్షి, ఘట్‌కేసర్‌ : క్రికెట్‌ ఆడుతూ మైదానంలో కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ తెలిపిన మేరకు..  చెంగిచెర్ల, బోడుప్పల్‌ వెంకటసాయినగర్‌లో నివాసముండే హర్యానాకు చెందిన లలిత్‌కుమార్‌(27) యాక్సిస్‌ బ్యాంక్‌ ఉద్యోగి. అవుషాపూర్‌ ఏఎన్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుతుండగా బంతిని పట్టుకునే క్రమంలో కింద పడిపోయి తిరిగి లేవలేదు. ఇతర క్రీడాకారులు ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top