సాక్షి, ఆదిలాబాద్ : క్రిప్టో కరెన్సీ పేరుతో వందలమందిని మోసం చేసిన అంతరాష్ట్ర నిందితులను పోలీసులు ఈ రోజు (ఆదివారం) అరెస్టు చేశారు. ఐటీసీ గ్లోబల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించి అందులో పెట్టుబడి పెడితే రెండేళ్లలో పెట్టుబడులు రెట్టింపు అవుతాయని ప్రజలను మోసం చేశారని పోలీసులు తెలిపారు. మోసంపోంజీ స్కీమ్, మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా వందలాది మందికి టోకరా వేశారని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 300 నుంచి 500 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆదిలాబాద్ వన్ టౌన్ పరిధిలో ఐదుగురి నుంచి సుమారు రూ.30 లక్షలు వసూలు చేశారని ఈ సంస్థ బాధితులు ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ బాధితులు ఉన్నట్లు తెలిపారు. జూమ్ మీటింగ్‌లు, హోటళ్లలో సమావేశాలతో ప్రజలకు వల వేశారని రూ. కోట్లలో మోసం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురిపై కేసు నమోదు చేయగా వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఆస్తులు ఫ్రీజ్ చేయడంతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: మిర్యాలగూడలో అగ్నిప్రమాదం


